AP: సిఎం జగన్ కీలక నిర్ణయం

తాడేపల్లి (CLiC2NEWS) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనాతో మృతి చెందిన‌ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల‌లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సిఎం ఆదేశించారు. ఈ ప్ర‌క్రియ న‌వంబ‌రు
30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయ‌న సోమ‌వారం తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యం నుండి వైద్య, ఆరోగ్య శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి డిప్యూటీ సిఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. వైద్య కాళాశాల‌ల‌ నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటు సిఎం సమీక్షిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల‌లో సిబ్బంది నియామకం, కోవిడ్ వాక్సినేషన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.