‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వెబ్‌సైట్

హైదరాబాద్ (CLiC2NEWS): ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వెబ్‌సైట్ ను రామ్‌చరణ్ సోమవారం ఆవిష్కరించారు. మెగస్టార్ చిరంజీవి ప్రారంభించిన ఈ ట్రస్ట్ సేవలు దాదాపు 25 భాషల్లో ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తేవడం కోసం ఈ వెబ్‌సైట్ ప్రారంభించినట్లు చరణ్ తెలిపారు. ఇంకా ‘కె.చిరంజీవి’ పేరుతో మరో వెబ్‌సైట్‌ను చరణ్ ప్రారంభించారు. చిరంజీవి జీవితం ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న సత్సబంధాల గురించిన సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంచామని ఆయన తెలిపారు.