వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌లో ఎపికి 5వ స్థానం

మొదటి స్థానంలో కేరళ

అమరావతి (CLiC2NEWS): రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేయడంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం మరో ఘనతను సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో 30.5% మందికి రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ అందించారు. రాష్ట్రంలో ఉధృతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం అంద‌రికి తెలిసిందే. 18–44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జ‌రుగుతుంది. ఎక్కువ మందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌–5లో నిలిచింది. కేరళ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 20.3 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి.

కేర‌ళ                 36%      మొదటి స్థానం
గుజ‌రాత్            35.3%   రెండ‌వ  స్థానం
ఢిల్లీ                   34%      మూడ‌వ స్థానం
జ‌మ్మూ కాశ్మీర్    33.3%  నాల్గ‌వ స్థానం

ఎపి                   30.5%   ఐదో స్థానం

Leave A Reply

Your email address will not be published.