యాదాద్రి ల‌క్ష్మిన‌రసింహస్వామి వారి స‌న్నిధిలో సిఎం కెసిఆర్

యాదాద్రి (CLiC2NEWS) : తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఈరోజు (మంగ‌ళ‌వారం)  యాదాద్రి శ్రీ‌ ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సిఎం  వేద పండితులు ఆశీర్వచ‌నాలందుకున్నారు.. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని సిఎం ఈరోజు అధికారికంగా ప్ర‌కటించనున్నారు. ఇటీవ‌ల ‌త్రిదండి చిన‌జీయ‌ర్‌స్వ‌మిని కెసిఆర్ క‌లిసి ఆల‌య పునఃప్రారంభ తేదీ, ముహూర్తం నిర్ణయించారు. వివరాలను మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు మీడియాకు సిఎం తెలియజేయ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.