యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత.. ఆలయ పునఃప్రారంభ పత్రిక
హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రారంభ ముహూర్త పత్రికను ముఖ్యమంత్రి కెసిఆర్ ఇఒకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి వారి పాదాల చెంత ఉంచాలని సిఎం సూచించారు. చినజీయర్‌స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసిచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు.
అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ముహూర్త వివరాలను ప్రకటించనున్నారు.