శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులుల భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు. ఇకె-524 విమానంలో దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాదాపు ఆరు కిలోల బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
బంగారాన్ని అక్రమంగా ఎమర్జెన్సీ లైట్‌లో పెట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులపై కేసునమోదు చేశారు.