తెలంగాణ పోలీసు వ్యవస్థ బలపడింది: డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సిసి కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని డిజిపి తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.