AP: పోలీసు అమ‌రుల కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చెక్కుల పంపిణి

అమ‌రావ‌తి( CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి కోవిడ్ విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన పోలీసు కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల చెక్కుల‌ను అంద‌జేశారు. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో జ‌రిగిన పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వ కార్య‌క్ర‌మం గురువారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎం పోలీసుల గౌరవ వంద‌నం స్వీక‌రించిన అనంత‌రం అమ‌రులైన పోలీసుల‌కు నివాళులు అర్పించారు. త‌రువాత కోవిడ్ విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన పోలీసు కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌రుపున‌ రూ. 10 ల‌క్ష‌ల చెక్కుల‌ను అంద‌జేశారు. త‌ద‌నంత‌రం 2017 నుండి పెండింగ్‌లో ఉన్న సోలీసు సంక్షేమ గ్రాంట్‌ను రూ.15కోట్లు మంజూరు చేశారు. దీని ద్వారా దాదాపు 206 కుంటుంబాల‌కు ల‌బ్ధి చేకూరుతుంది.

Leave A Reply

Your email address will not be published.