అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ (CLiC2NEWS): అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు. గురువారం సనత్‌నగర్‌లోని ఇఎస్ ఐ ఆసుపత్రిని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 100 కోట్ల టీకా పంపిణీ మార్క్‌ను చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ విజయంతో ప్రపంచంలోని అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి గవర్నర్ కృజ్ఞతలు చెప్పారు.
విదేశాలకు దేశీయంగా ఉత్పత్తి చేసిన టీకాలు ఎగుమతి చేశాం. దేశ వ్యాప్తంగా వంద కోట్ల మంది టీకా తీసుకున్నారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలి. ఐసీయూలో చేరిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారేనని తెలిపారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలకు కూడా టీకా రానుంది అని గవర్నర్ తెలిపారు.