మంచిర్యాల, పెద్దపల్లి, క‌రీంన‌గ‌ర్‌ జిల్లాల్లో భూకంపం.

మంచిర్యాల (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జ‌నం ఇళ్ల‌నుంచి ప‌రుగులు పెట్టారు. శనివారం ఉత్త‌ర తెలంగాణ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

మంచిర్యాల:
జిల్లాలో కాలేజ్‌ రోడ్‌, రాంన‌గ‌ర్‌, సున్నంబట్టివాడ, న‌స్పూర్‌,సిర్కె, సిసిసి, గోసేవామండ‌ల్‌, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్‌, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది.

మంచిర్యాల ప‌ట్ట‌ణంలోని తోళ్లవాగు సమీపంలోని ఓ ఇంటి కిటికీ పైపెచ్చు ఊడిన దృశ్యం

పెద్దపల్లి:
జిల్లాలోని రామ‌గుండం, ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె త‌దిత‌ర ప్రాంతాలలో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

క‌రీంన‌గ‌ర్‌:
జిల్లాలో భూకంప తీవ్రత‌ 4గా న‌మోదైంది. క‌రీంన‌గ‌ర్‌కు ఈ శాన్యంగా 45కి. మీ దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించార‌ని తెలిసింది.

ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్ర‌జ‌లంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.