ప్లేట్లెట్స్ పెంచుకోవటానికి ప్రతిరోజు కలబంద..

ప్రస్తుతం డెంగీ జ్వరం చాలా మందికి వస్తుంది. దీనితో ప్లేట్లెట్స్ బాగా పడిపోతున్నాయి. సరైన సమయంలో రోగికి రక్తం ఎక్కించకపోతే మరణం కూడా సంభవిస్తుంది. కనుక ప్లేట్లెట్స్ పెంచుకోవటానికి రోగులు కానీ, ఆరోగ్యవంతులు కానీ ప్రతిరోజు పరిగడుపున కలబంద గుజ్జుని తింటే తగ్గిన ప్లేటిలెట్స్ పెరుగుతాయి. అంతేకాకుండా సమస్త స్త్రీల‌కు సంబంధించిన  వ్యాధులను కూడా తగ్గిస్తుంది.

🪴 వాత‌రోగాలు, తలసీమియా, హైపటైటిస్ B, విరోచనం సరిగా కాకపోవటం, పొట్ట ఉబ్బరం, ఆకలి లేకపోవటం, తినాలని ఆసక్తి        లేకపోవటం, భోజనం చేస్తే కడుపులో మంటగా ఉండటం, స్త్రీలలో నెలసరి సరిగా రాకపోవటం, మూత్రవిసర్జన సమయంలో మంటగా ఉండటం, మొదలైన సమస్యలు కలబంద సేవించటం తో తగ్గుతాయి.

🪴 హెచ్చరిక, అస్తమా, సైనస్, ఊపిరితిత్తుల వ్యాధి వున్నవారు దీనిని తినరాదు.

 

-బహర్ ఆలీ
ఆయుర్వేద వైద్యుడు

 

Leave A Reply

Your email address will not be published.