టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్ ) అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆయన తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైటెక్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాసరెడ్డి, కెసిర్ ఎన్నికను ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.