ఓఆర్ఆర్‌పై ఘోర ప్ర‌మాదం : ముగ్గురు మృతి

మేడ్చ‌ల్ (CLiC2NEWS): మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లం యాద్గార్‌ప‌ల్లి వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ ఎసిపి కెవిఎం ప్ర‌సాద్ కుటుంబ‌స‌భ్యులు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి వేగంగా డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎసిపి కుటుంబ స‌భ్యులు ముగ్గురు మృతి చెందారు. ఒక‌రికి తీవ్ర గాయాలయ్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకున్నారు. మృతుల‌ను సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులుగా పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదంలో ఏసీపీ కేవీఎం ప్ర‌సాద్ స‌తీమ‌ణి శంక‌ర‌మ్మ‌, సోద‌రుడి కుమారుడు భాస్క‌ర్ దంప‌తులు మృతి చెందారు. ఏసీపీ సోద‌రుడు బాల‌కృష్ణ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. బాల‌కృష్ణ‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో వివాహ వేడుక‌కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.