AP: కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల స‌హాయం..

ఎపి వైద్య ఆరోగ్య శాఖ ఉత్త‌ర్వులు

అమ‌రావ‌తి (CLiC2NEWS) : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కరోనాతో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 50 వేలు ప‌రిహారం అందించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన చెల్లింపులు విప‌త్తు నిర్వ‌హ‌ణ నిధి నుండి చెల్లించాల‌ని ఎపి వైద్య ఆరోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. డిఆర్‌వొ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాల‌కు రెండు వారాల్లో ప‌రిహారం అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించింది. అదేవిధంగా కుటుంబ స‌భ్యుల‌నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.