రోమ్ పర్యటనలో ప్రధాని మోడి

రోమ్ (CLiC2NEWS): జి20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇటలీ పర్యటనకు వెళ్లారు. దాదాపు 12 సంవత్సరాల తరువాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని ఈయనే అని భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. ఈరోజునుండి అక్టోబరు 31 వరకు రోమ్, వాటికన్ సిటిలలో ప్రదాని పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వెన్యూ పియాజా గాంధీ ప్రాంతంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. తదనంతరం ఇటలీ ప్రధాని మారియో ద్రాగీ తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. మరుసటి రోజు వాటికన్ సిటిలో జి20 సదస్సుకు హాజరవుతారు. తదనంతరం మోది యూకె వెళ్లనున్నారు. యూకె ప్రధాని బోరిన్ జాన్సన్ ఆహ్వానం మేరకు గ్లస్గోలో జరిగే కాప్26 సదస్సులో నవంబరు 1వ తేదీన బోరిన్ తో భేటి కానున్నారు. నవంబరు 3వ తేదీకి పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లి చేరుకోనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.