రైత‌న్న‌ల‌కు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట (CLiC2NEWS): రైతన్న‌ల‌కు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట‌లోని ఐడిఒసి మీటింగ్ హాల్‌లో సోమవారం ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పాక్స్ చైర్మన్ లు, వ్యవసాయ అధికారులు త‌దిత‌ర అధికారులతో.. మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ స‌మీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఇంత‌కు ముందు ఎన్నడూ లేనివిధంగా ఒక లక్షా 22 వేల 989 హెక్టార్ లలో వరి సాగు చేయగా 7 లక్షల 62 వేల 533 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 225, ప్యాక్స్ ఆధ్వర్యంలో 156, AMC ఆధ్వర్యంలో 10, మెప్మా ఆధ్వర్యంలో 05 మొత్తం 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇ ప్పటికే 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మిగతా కేంద్రాలను తెరుస్తామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వం గ్రేడ్ -A రకం ధాన్యం కు క్వింటాల్‌కు రూ.1960..
కామన్ రకానికి రూ.1940 కనీస మద్దతు ధరగా అందజేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.