TSహుజూరాబాద్ ఈటెల రాజేందర్ ఘన విజయం

- హుజూరా బాద్ ఉప ఎన్నికకౌంటింగ్ ముగిసింది.
- ఈ ఉప ఎన్నికలో భాజాపా అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు.
హుజురాబాద్(CLiC2NEWS): హుజురాబాద్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందారు. భాజాపా అభ్యర్థి ఈటెల రాజేందర్ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. 22వ రౌండ్లో 1,130 ఓట్లు ఆధిక్యం సాధించారు. మొత్తం బిజెపికి 1,06,780 ఓట్లు రాగా, తెరాసాకు 82,348 ఓట్లు పోలయ్యాయి. దీంతో బిజెపికి 23,865 ఓట్ల ఆధిక్యం లభించింది.