నందమూరి బాలకృష్ణ భుజానికి శస్త్ర చికిత్స

హైదరాబాద్ (CLiC2NEWS): నందమూరి బాలకృష్ణకు గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. కేర్ ఆసుపత్రి వైద్యులు ఆయన భుజానికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ రఘువీర్‌రెడ్డి, డాక్గర్ బి.ఎన్. ప్రసాద్‌ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి భుజానికి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.