ఆకాశంలో బెడ్రూం..!

ఇస్తాంబుల్: ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే.. అయినా కూడా ఆకాశంలో ఎగిరే బెడ్రూం ఏంటని ఆలోచించకండి.. మీకు అంత నమ్మశక్యంగా లేకుంటే.. ఇది చదివాక కింద ఉన్న వీడియోని చూడండి.. టర్కీకి చెందిన ఓ వ్యక్తి ఆకాశంలో ఎగిరే మంచంపై అలారం సెట్ చేసుకుని మరీ దర్జాగా పడుకుని ప్రయాణించాడు. పక్కకు బెడ్‌లైట్.. అలారమ్, అద్దం ఇలా బెడ్రూంలో ఉండాల్సిన కనీస వస్తువులన్నీ సెటప్ చేసుకుని గాల్లో నిద్రపోయాడు. అసలు విషయానికి వస్తే ఈ ఫీట్ చేసింది టర్కీకి చెందిన హసన్ కావల్. పారాగ్లైడర్‌కు బెడ్లాంటి సోఫాసెట్‌ను తగిలించి, ఆకాశంలో దానిపై పడుకుని ప్రయాణించాడు. అంతకంటే ముందు అలారం సెట్ చేసుకున్నాడు. కళ్లకు డార్క్ మాస్క్ పెట్టుకుని మరీ రిలాక్స్‌గా నిద్రపోయాడు. ఆ ఫ్లయింగ్బెడ్ అలా సముద్రంపై ప్రయాణించి ప్రయాణించి చివరకు బీచ్‌లో దిగింది. ఈ ఫీట్ అనంతరం హాసన్ మాట్లడుతూ.. `ఆకాశంలో పడుకుని ప్రయాణిస్తుంటే స్వర్గంలా అనిపించింది.. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది` అని తెలిపారు. ఈ ఫీట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా భారీ సంఖ్యలు చూసారు.