సామాజిక వైద్యుడా.. అందుకో మా అభినందనలు..!

సమస్త మానవాళి మనుగడ కోసం నీ ప్రాణాలను పన్నంగా పెట్టీ ఉద్యోగం చేస్తున్న
వీరుడా ఓ విలేకరి…
అందుకో మా అభినందనలు..!

పెరుకపోయిన అంతుచిక్కని సామాజిక రుగ్మతలను… పెన్నుతో నయం చేసిన సామాజిక వైద్యుడా
ఓ విలేకరి..
అందుకో మా అభినందనలు..!

దోపిడి దౌర్జన్యాలను కలంతో అతంచేసి ప్రజా మన్నలను పొందిన ధైర్యవంతుడా..
ఓ విలేకరి
అందుకో మా అభినందనలు..!

మహిళలపై జరగుతున్న ప్రతీ సంఘటనలను కలంతో సమాజం ముందు ఉంచుతూ..
వీరనారీమణుల జీవిత చరిత్రను తెలుపుతూ..
మహిళలో ధైర్యసాహసాలు నింపిన ఆత్మీయుడా..
ఓ విలేకరి
అందుకో మా అభినందనలు..!

కొండెక్కి పోతున్న ఎందరో మగువల జీవితాల్లో వెలుగులు నింపి
అందుకు కారణం అయిన వారి గుట్టు రట్టుచేసి మగువల గుండెళ్ళో దేవుడై నిలిచిన..
ఓ విలేకరి
అందుకో మా అభినందనలు..!

-మంజుల పత్తిపాటి

Leave A Reply

Your email address will not be published.