రామ్ చరణ్-పూజా హెగ్డే నీలాంబరి సాంగ్ ప్రోమో చూశారా?

చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో తెకెక్కుతున్న చిత్రం చిత్రం ఆచార్య. ఇందులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించారు.రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా దీపావళికి రెండో గీతం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమాలో చరణ్, పూజాల మధ్య ‘నీలాంబరి’ గీతాన్ని నవంబర్ 5న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమోను దీపావళి కానుకగా గురువారం విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
నీలాంబరి అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన నృత్యంతో ఆకట్టుకున్నాడు. పూజా హెగ్డే లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. నీలాంబరి’ అంటూ సాగే బ్యూటీ ఫుల్ మెలోడీని రేపు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.