AP: వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు (CLiC2NEWS): జిల్లాలోని నగరి డిగ్రి కళాశాల క్రీడా మైదానంలో నవంబరు 1వ తేదీ నుండి 16 తీదీ వరకు `స్పోర్ట్స్‌మీట్` నిర్వహిస్తున్నారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను నగిరి ఎమ్మల్యే ఆర్కె రోజా శుక్రవారం ప్రారంభించారు. నవంబరు 17వ తేదీన ఆమె జన్మదినంను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్వహించే పోటీలను ఎమ్మల్యే రోజా ప్రారంభించి క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు.