Good News: దిగివస్తున్న వంట నూనెల ధరలు
కిలో రూ.20 వరకు తగ్గింపు

న్యూఢిల్లీ (CliC2NEWS): వంట నూనె ధరలు కిలోకు రూ. 7 నుంచి రూ.20వరకు తగ్గినట్టు కేంద్ర ఆహార ప్రజాపంపిణి విభాగం తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా వంట నూనె ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. కిలో నూకె ధర రూ. 190-120 వరకు ఉండేది. ఈ ఏడాది క్రమ క్రమంగా తగ్గుతూ వస్తూ ప్రస్తుతం రూ. 150-160 వరకు ఉంది. ఇపుడు తాజాగా మరికాస్త తగ్గే అవకాశం ఉంది. పామాయిల్, పల్లి నూనె, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెతోపాటు అన్ని ప్రధానమైన నూనె రకాలపై ధరలు తగ్గినట్లు పుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రి బ్యూషన్ డిపార్టుమెంట్ కార్యదర్శి తెలియజేశారు.