మందుబాబులకు సూపర్ న్యూస్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తు పై హైకోర్టు కీలక ఆదేశాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీజ్ చేసిన వాహ‌నాల కోసం మందుబాబులు ఇక నుంచి పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిరగాల్సిన ప‌నిలేదు. ఈ మేర‌కు హైకోర్టు కీల‌క శుక్ర‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని ధ‌ర్మాస‌నం పేర్కొంది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం అంద‌జేయాలని పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి.. త‌ర్వాత ఇవ్వాలి. ప్రాసిక్యూష‌న్ అవ‌స‌ర‌మైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్ వేయాలి. ప్రాసిక్యూష‌న్ పూర్త‌య్యాక వాహ‌నం అప్ప‌గించాల‌ని పేర్కొంది.
అలాగే వాహ‌నం కోసం ఎవ‌రూ రాక‌పోతే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. ఆదేశాలు అమ‌లు చేయ‌ని పోలీసుల‌పై కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.