కామారెడ్డి జిల్లాలో జడ్పీ పాఠశాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

కామారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో రూ.6 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..కోనాపూర్ ప్రాథమిక పాఠశాలను కూడా ఆధునిక అంగులతో నిర్మిస్తామన్నారు. జూనియర్ కాలేజీకి అనుమతిని ఇస్తామని మంత్రి తెలిపారు. బీబీపేట్‌లో కోట్ల రూపాయలతో ఇంత చక్కటి పాఠశాలని నిర్మించిన దాత సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకి మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
కాగా ప్రముఖ కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి తన సొంత ఖర్చుతో జనగామలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ పాఠశాలను తలపించే విధంగా ఆధునీకరించారు.