మంత్రి హరీశ్ రావుకు వైద్య, ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి హరీశ్‌రావు ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
గతంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారు.