ధర్నాల కోసం కలెక్టర్ల అనుమతి తీసుకోండి: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై ఈ నెల 12న (శుక్రవారం) ధర్నాకు తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్నాల కోసం జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి కెటిఆర్ సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ధర్నాల నిర్వహణకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు మంత్రి సూచించారు.
ఈ నెల 12న టిర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నానిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌ను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వెంకటేశ్వర్లు, దానం నాగేందర్ ఉన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల నేపథ్యంలో… ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని నిర్వహించాలని, పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS పిలుపునిచ్చారు.
2/2
— TRS Party (@trspartyonline) November 10, 2021