హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్

హైదరాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన ఈటల రాజేందర్ ఇవాళ (బుధవారం) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు హాజరయ్యారు.
మంత్రిగా ఉన్న ఈటలను పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన ఈటల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికలో ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే.