పెట్రోల్‌ ట్యాంకర్‌ – బస్సు ఢీకొని 10 మంది సజీవ దహనం..

బార్మర్ (CLiC2NEWS): :రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోట‌చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు ప్ర‌మాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పచ్‌పద్రా సమీపంలోని బలోత్రా వద్ద బర్మర్‌‌ – జోధ్‌పూర్‌‌ హైవేపై బుధ‌వారం ఉదయం 10 గంటల సమయంలో బస్సు, ట్ర‌క్కు ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో బస్సులో భార‌గా మంటలు చెలరేగాయి. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో న్న 25 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌మాదంలో పదిమంది దుర్మరణం చెందినట్లు సమచారం. ట్రక్కు – ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

ఈ ప్ర‌మాద విష‌యం తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో పలువురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్య‌మంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని సజీవంగా రక్షించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.