Rain Effect: తిరుమలలో రెండు ఘాట్‌రోడ్లు మూసివేత

తిరుమల (CLiC2NEWS): భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాత్రి నుంచి చెన్నై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్‌లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్‌లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.