జర్నలిస్టులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): జర్నలిస్టుల కు టిఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. ట్విట్టర్ లో పలువురు జర్నలిస్టుల చేసిన సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రిడిటేషన్ క‌లిగిన జర్నలిస్టులు బస్సు టికెట్ తీసుకునేందుకు ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది.

తాజాగా ఎండి స‌జ్జ‌నార్ టిఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు . తాజాగా TSRTC వెబ్సైట్లో జర్నలిస్టు 2/3 కన్సెషన్ ఆప్షన్ను జోడించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సజ్జనార్.

Leave A Reply

Your email address will not be published.