కాలుష్యం ఎఫెక్ట్‌: ఢిల్లీలో పాఠ‌శాల‌లు, కాలేజీలు బంద్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం కేజ్రీవాల్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీతో పాటు స‌మీప న‌గ‌రాల్లో ని పాఠ‌శాల‌లు, కాలేజీల‌ను మూసివేయాల్సిందిగా స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. క‌మిష‌న్ ఫ‌ర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆన్‌లైన్ విధానంలో ఎలా విద్యాసంస్థ‌లు ప‌నిచేశాయో అదే రీతిలో ప్ర‌స్తుతం స్కూళ్లు, కాలేజీలు న‌డ‌వ‌నున్నాయి. ఈ మేకు సీఏక్యూఎం మొత్తం 9 పేజీల‌తో కూడిన ఆర్డ‌ర్‌ను రిలీజ్ చేసింది. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ, హ‌ర్యానా, రాజ‌స్థాన్‌, యూపీ రాష్ట్రాలు క‌నీసం న‌వంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసే విధంగా ఆదేశించాల‌ని సీఏక్యూఎం కోరింది.

Leave A Reply

Your email address will not be published.