TS: ఉచితంగా డయాలసిస్ సేవలు: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్(CLiC2NEWS):తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుతో ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ బాధితులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. దీని కోసం హైదరాబాద్, వరంగల్ లలో ఒక్కో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక డయాలసిస్ కేంద్రాల్లో ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఐదు చొప్పున బెడ్లు కేటాయించాలని ఆదేశించారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలిసిస్ చేయించుకోవడం ఆర్థికంగా భారంగా మారటంతో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ వ్యాప్తంగా 43 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి, వీటిద్వారా పదివేల మంది రోగులకు నిత్యం సేవలు అందుతున్నాయని వివరించారు. ఈ డయాలసిస్ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇహెడ్ ఎస్ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీవి మీనా, డిఎంఈ రమేశ్ రెడ్డి, సిఎం ఓఎస్డి డాక్గర్ గంగాధర్ టిఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.