శివశంకర్ మాస్టార్ కుటుంబానికి చిరు ఆర్ధిక సాయం..

హైదరాబాద్(CLiC2NEWS): ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ చికిత్స నిమిత్తం మెగస్టార్ చిరంజీవి తనవంతు సాయంగా రూ. 3లక్షల చెక్కును అందజేశారు. శివశంకర్ చిన్న కుమారడైన అజయ్‌ను తన ఇంటికి పిలిచి మాస్టార్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి, కంగారు పడొద్దని చెప్పారు. మాస్టర్‌కు తామంతా అండగా ఉంటామని ధైర్యాన్ని చెప్పారు. కొన్ని రోజుల క్రితం శివశంకర్ మాస్టర్ కరోనాతో చికిత్స నిమిత్తం ఎఐజి ఆస్పత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తులకు 75% ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఆయన పెద్ద కుమారుడు సైతం కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.