ఎపిలో వరదల నష్టం అంచనా.. కేంద్రబృందాల పర్యటన

చిత్తూరు (CLiC2NEWS) ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయుటకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను , రహదారులను, ముంపునకు గరైన ఇళ్లను పరిశీలించారు. తిరుపతిలోని ఎమ్మార్ రెడ్డి నగర్, పూల వాణిగుంట, కొరమేనుగుంట శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, తదితర ప్రాంతాలు సందర్శించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా పాలనాధికారి హరి నారాయణ, నగరపాలక కమిషనర్ గిరీష నష్టం జరిగిన వివరాలను ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి వివరించారు.