భారతీయ రైల్వేలో 45 అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..

ఢిల్లీ (CLiC2NEWS): భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉన్న రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటి (RLDA)లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ ఇంజనీరింగ్‌లో బిఈ /బిటెక్ చేసి, గేట్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వరా మొత్తం 45 పోస్టులు భర్తీచేయనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 23 వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ rlda.indianrailways.gov.in. చూడగలరు.