సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నమూత

సిరివెన్నెల సీతారాశాస్త్రి న్యుమోనియాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన 800లకు పైగా చిత్రాలలో సుమారు 3వేల పాటలు రాశారు. కేంద్రప్రభుత్వం 2019లో పద్మశ్రీని అందించింది. 1986 కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల చిత్రంతో పాటల రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సీతారామశాస్తి.. ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. ఆదే సినిమాకు ఉత్తమ గేయ రచయితగా ఆవార్డుని కూడా అందుకున్నారు.