భీమ్లానాయక్ నుండి ‘అడవి తల్లి మాట’ పాట విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): భీమ్లా నాయక్ చిత్రం నుండి నాలుగో పాటను విడుదల చేశారు. అడవి తల్లి మాట.. అంటూ సాగే పాటను శనివారం విడుదల చేశారు. పవన్‌కల్యాణ్, రానా కథానాయకులుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం భీమ్లానాయక్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రానికి రేమేక్‌గా భీమ్లానాయక్ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.