జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కోరుట్లలో ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్నాయి.

జగిత్యాల (CLiC2NEWS): జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్రావు పేట వద్ద ఆర్టీసి బస్సు, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు-కారు ఎదురెడురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.