టి.వేదాంత సూరి: తెగని జ్ఞాపకాలు
జ్ఞాపకాలు ఎప్పుడూ మనలను వెంటాడుతూనే ఉంటాయి. అవి తలుచుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో ఊరట నిస్తాయి.. అందుకే అంటారేమో గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని.. ఎస్. పి . బాలసుబ్రహ్మణ్యన్ కు జ్ఞాపకాలు ఎన్నెన్నో.. అవి అందరితో పంచుకునే వారు.. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే.. నా చిరకాల మిత్రుడు కొక్కుల భాస్కర్ రాసిన పాటను ఆయనతో పాడించారు.. ఈ విషయం చాలా మందికి తెలియదు.. బాలు ఇక లేరన్న విషయం తెలిసి ఆ పాటను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి పంపారు.. ఆ పాట సామాన్యులారా సమాధి కాకండి… అంటూ సాగుతుంది. ఆ పాట వింటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అవి కొన్ని మీ ముందు ఉంచాలను కుంటున్నాను.. 1980- 81 ప్రాంతం లో నేను కరీంనగర్ లో ఉండేవాడిని. అప్పుడు పురాణం రామచంద్ర గారి సంపాదకత్వం లో చిత్రిక వార పత్రిక వచ్చేది.. అందులో నేను కూడా పని చేసే వాడిని.. జర్నలిజం లో అడుగు పెట్టింది అక్కడే.. కల్చరల్ కార్యక్రమాలు , పుస్తక సమీక్షలు రాయడం.. నా అభిరుచులు. ఇందాక చెప్పిన నా మిత్రుడు కొక్కుల భాస్కర్ కు సినిమా తీయాలన్న కోరిక. చాలా కష్టపడ్డారు. డబ్బులు కూడా పోగొట్టుకున్నారు.. కానీ నాటకాలు వేయడం, పోటీలకు పంపడం. ఎక్కడ నాటకాల పోటీలు జరిగినా పాల్గొనడం మొదటి బహుమతి పొందడం నిజంగా ఆశ్చర్యం వేసేది.. కరీంనగర్ కళాభారతి అప్పుడే కొత్తగా నిర్మించారు.. అందులో సామాన్యులారా సమాధి కాకండి అనే నాటిక ఎన్ని సార్లు వేసినా హాలు నిండి పోయేది.. శాసన సభ్యలు, జిల్లా కలెక్టర్ కూడా వచ్చి చూసే వారు.. ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా నేను వుండే వాడిని.. నాపై ఇప్పటికి భాస్కర్ కు ప్రేమ, అభిమానం.. నమ్మకం, అందుకే నాకు అయన అవకాశం ఇచ్చేవారు. ఆ నాటికను సినిమాగా తీయాలనుకున్నారు.. కానీ కార్య రూపం దాల్చలేదు.. అయితే ఆ పాటను బాలు తో పాడించడం ఒక గొప్ప అనుభూతి. ఆ రోజుల్లోనే విప్లవాత్మక భావాలతో భాస్కర్ రాసిన పాట అది.. వేదికల పైన మాట్లాడే అలవాటు కూడా నాకు ఈ అవకాశాలు కల్పించాయి. అంతే కాదు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.. . ఈ పాట వింటుంటే పాత రోజులు గుర్తొచ్చాయి.. నేను రాసిన తోలి పుస్తకం భావ వీచికలు అనే కవితా సంపుటికి దాశరధి, కృష్ణమా చార్యులు, సినీ నటులు రాజబాబు, కాక రాల తో ముందు మాటలు రాయించి తెచ్చిన వారు కూడా భాస్కర్ గారే.. నేను కొన్నాళ్ల పాటు నడిపిన అరుణరేఖ కు ప్రముఖ సినీ చిత్రకారులు గంగాధర్ గారితో టైటిల్ రాయించింది.. భాస్కర్ గారే.. అయన శ్రమకు ప్రతిఫలం ఆరోజుల్లో రాలేదు.. ఇప్పుడు సిరిసిల్ల లో స్థిర పడ్డారు.. వారికి అభినందనలు..
ఆ బాలు పాడిన పాట వీడియో కూడా ఇక్కడ ఇస్తున్నాను..