కుప్పకూలిన `బిపిన్ రావత్` ప్రయాణిస్తున్న హెలీకాప్టర్

చెన్నై(CLiC2NEWS) : తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. కానూరు వెల్లింగ్టన్ బేస్‌లో బుధవారం ప్రమాదం సంభవించింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కుప్ప కూలిపోయింది. హెలెకాఫ్టర్‌లో బిపిన్ రావత్ తోపాటు సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యలు కలిసి 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన భారత్‌కు అత్యంత శక్తివంతమైన సైనికాధికారి.
Chopper was carrying senior defence officials pic.twitter.com/bPaQaJYhN8
— DD News (@DDNewslive) December 8, 2021