విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా జనసేనాని

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దీక్షచేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకుపైగా కొనసాగుతున్న విషయం తెలిసినదే. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్‌కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టి కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినట్టు పార్టి వర్గాలు తెలిపారు. ఈ దీక్ష సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని తెలియజేశారు.