మంచు విష్ణు కీలక నిర్ణయం.. 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదం

హైదరాబాద్(CLiC2NEWS): మంచు విష్ణు ‘మా’ ఎన్నికలలో గెలుపొందిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్లోని 11 మంది సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. మూవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలు చేయొద్దని, రాజీనామా లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరినప్పటికీ వారు అంగీకరించలేదని, అందుకే రాజీనామాలు ఆమోదిస్తున్నామని తెలిపారు.
మూవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుండి 11 మంది సభ్యులు గెలుపొందారు. మా అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌పై విష్ణు విజయం సాధించిన విషయం తెలిసినదే. ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌లోని గెలుపొందిన 11 మంది సభ్యులు, విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి పనిచేయలేమని తమపదవులకు రాజీనామాలు ప్రకటించారు.