మిస్ యూనివర్స్ హర్నాజ్ సింధు

ఇజ్రాయెల్ (CLiC2NEWS): మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్ యూనివర్స్ – 2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 సంవత్సరాల హర్నాజ్ కౌర్ సింధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్కిరీటం దక్కినట్లయింది. ఈ పోటీల్లో 80 దేశాల నుంచి వచి్చన అందగత్తెలను వెనక్కి నెట్టి ఈ కిటీటాన్ని కైవసం చేసుకుంది. ఇంతకు ముందు ఈ కిరీటాన్ని సుస్మితా సేన్ (94), లారా దత్తా (2000)లు గెలుచుకున్నారు.