`అయోధ్య`కి తరలుతున్న భారీ గంట
నిర్మల్ / ఆదిలాబాద్ : అయోధ్య రామ మందిరానికి, రామేశ్వరం నుండి అయోధ్య రామ మందిరానికి భారీ గంటను తరలిస్తున్న రామ రథయాత్ర ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లాకు ప్రవేశించింది. సోన్ గ్రామం వద్ద రాత్రి రథానికి బిజెపి కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ నాయకులు ప్రేమ్‌కుమార్, రాచకొండ సాగర్, మధుసూదన్ తదితరులు పెద్ద సంఖ్యలో స్వాగతం చెప్పడం జరిగింది ఈ రోజు ఆర్కే ఫంక్షనల్ వద్ద ఉదయం పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించి ఆదిలాబాద్‌కు వెళ్ళడం జరిగింది.
తమిళనాడుకు చెందిన రాజ్యలక్ష్మి సెప్టెంబర్ పదిహేడో తేదీనాడు రామేశ్వరం నుండి రామ రథాన్ని ప్రారంభించి అక్టోబర్ ఏడో తేదీ నాడు అయోధ్యకు చేరుకోవడం జరుగుతోంది. ఈ యాత్ర మొత్తం నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ఆరు వందల పదిహేను కిలోల గంటను తీసుకెళ్లడం జరుగుతుంది అది అయోధ్యలోని భవ్య రామాలయంలో స్థాపించడం జరుగుతుంది. గంటతో పాటు రామ లక్ష్మణ సీతా హనుమాన్ విగ్రహాలను పూజ చేసి ఈ రోజు యాత్రకు వీడ్కోలు పలికింది ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విశ్వహిందు పరిషత్ బిజెపి నాయకులు రావుల రాంనాథ్ ,ఒడిసెల శ్రీనివాస్ ,పొన్నం నారాయణగౌడ్ ,ఎల్ కిషన్ ,ముప్పిడి రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అర్జున్,అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ : అయోధ్య రామ మందిరానికి భారీ గంటను తరలిస్తున్న రామ రథయాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్బంగా లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యం తో ఈ భారీ గంటను అయోధ్య రామ మందిరం లో పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మందా రాజ్యలక్ష్మి తెలిపారు. తానే స్వయంగా ఈ DCM వ్యాన్ ని రామేశ్వరం నుండి అయోధ్య వరకు 4550 కి,,మీ తోలుతున్నాని అన్నారు, ఈ భారీ గంట 4అడుగుల ఎత్తు 3అడుగుల వెడల్పు 653 కిలోల బరువు కలిగి ఉందని ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా యాత్ర మొదలుకొని వచ్చే నెల 7 తేదీన అయోధ్య చేరుతుందని ఆమె తెలిపారు. ఈ భారీ గంట గుడిహత్నూర్ కి చేరుకోగానే గుడిహత్నూర్ ZPTC పతంగే బ్రహ్మానంద్, PACS చైర్మన్ ముండే సంజీవ్, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు భారీ గంట పై పువ్వులు చల్లి పూజలు నిర్వహించారు మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.