TS: రూ. 500 చెల్లించి హాజరు మినహాయింపు పొందవచ్చు

హైదరాబాద్ (CLiC2NEWS) : ఇంటర్‌లో ఆర్ట్స్, మ్యుమానిటీస్ వంటి కోర్సులు చదివే విద్యార్థులు రూ. 500 చెల్లించి హాజరు మినహాయింపు పొందవచ్చు. విద్యార్థుల కళాశాలలకు వెళ్లకుండా ఫైనల్ పరీక్షలకు హాజరుకావచ్చు. ఇలాంటి హాజరు మినహాయింపు కావలసిన విద్యార్థులు రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. సైన్స్ విద్యార్థులకు ఇటువంటి మినహాయింపు వర్తించదు. వచ్చే సంవత్సరం జనవరి 5వ తేదీలోపు ఈ మొత్తం చెల్లించి హాజరు శాతంనుండి మినహాయింపు పొందవచ్చని వెల్లడించారు. జనవరి 18లోపు ఆలస్య రుసుము రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈవిధంగా హాజరు మినహాయింపు పొందిన విద్యార్థులను ప్రైవేట్ విద్యార్థులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు.