తిరుపతిలో శ్రీవారి పౌర్ణమి గరుడసేవ

తిరుపతి (CLiC2NEWS): తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ కనులపండుగగా జరిగింది. ఆదివారం రాత్రి 7గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటి ఈఓ రమేశ్‌బాబు, విజిఓ బాలిరెడ్డి తదితరులు గరుడసేవలో పాల్గొన్నారు.