ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ..

ఢిల్లి (CLiC2NEWS): దేశ రాజధానిలో ఢిల్లీలో నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నవి. ఢిల్లీలో ఇప్పటి వరకు 79 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది .
గడిచిన 24 గంటల్లో 290 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణయ్యాయి. తాజా కేసులుతో కలపి ఢిల్లీలో మొత్తం కొవిడ్ కేసులు 14,43,352 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.