ఏపీలో కొత్తగా 5,487 కరోనా కేసులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 66121 నమూనాలను పరీక్షించగా 5,487 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వైరస్ నుంచి 7,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,81,161 పాజిటివ్ కేసులు నిర్ధారించగా.. ఇందులో 63,116 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,12,300 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగా వైరస్ ప్రభావంతో తాజాగా 37మంది మరణించగా.. ఇప్పటి వరకు 5,745 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,010 మంది, పశ్చిమగోదావరిలో 903, ప్రకాశంలో 634, గుంటూరులో 538, నెల్లూరులో 489, విజయనగరంలో 362, చిత్తూరులో 329, అనంతపురంలో 310, శ్రీకాకుళంలో 286, కడపలో 271, విశాఖపట్నంలో 149, కర్నూల్‌లో 113, కృష్ణాలో 97 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
మరణాలు
ప్రకాశం జిల్లాలో 7 మంది, చిత్తూరు జిల్లాలో 6 మంది, కృష్ణా జిల్లాలో 5గురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5745కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 5666323 నమూనాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.