రేపట్నుంచి రైతుబంధు నిధులు పంపిణి..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రేపట్నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద నిధులు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో 152.91 లక్షల ఎకరాలకు రూ. 7645.66 కోట్లు ప్రభుత్వం జమ చేయనున్నది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి రూ. 43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి ఏడు విడతల్లో జమచేసినట్టు తెలిపారు. ఈ సీజన్ తో కలిపి మొత్తం రూ 50వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు.